IPL 2026: SRH ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే..?

IPL 2026: SRH ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే..?


IPL 2026: SRH ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో రెండు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత విడుదల చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ప్రారంభ మ్యాచ్: ఆర్సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కొంటుంది. గత ఏడాది ఆర్సీబీ ట్రోఫీ వేడుకల సమయంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కారణంగా కొంతకాలం ఈ స్టేడియంలో మ్యాచ్‌లు జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ వేదికకు మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది.

హైదరాబాద్ లో ఒకే ఒక్క మ్యాచ్..

ఐపీఎల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కు షెడ్యూల్ తో ఊహించని షాక్ ఎదురైంది. ఎందుకంటే, ఉప్పల్ స్టేడియంలో ఒకే ఒక్క మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ జట్టుదే అని సంతోష పడిన అభిమానులకు.. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ తో షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న లక్నోతో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ లో కేవలం ఉప్పల్ స్టేడియంలో ఒకే ఒక్క మ్యాచ్ జరగనుండడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ముంబై, చెన్నై జట్ల మొదటి మ్యాచ్‌లు..

ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌ను గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది. ఈ నాలుగు జట్లు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే ట్రోఫీలు గెలిచిన జట్లుగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు చొప్పున టైటిల్ గెలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు సార్లు ట్రోఫీ గెలుచుకోగా, రాజస్థాన్ రాయల్స్ 2008లో మొదటి ఐపీఎల్ సీజన్‌ను గెలిచింది.

మ్యాచ్ టైమింగ్స్..

ఐపీఎల్ 2026 తొలి దశలో రెండు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ఉన్నాయి. సాధారణ మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. డబుల్ హెడ్డర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్న మ్యాచ్ 3:00 గంటలకు మొదలవుతుంది. మిగిలిన మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఎన్నికల ప్రకటన తర్వాత ప్రకటించబడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *