పెళ్లికి రెడీ అయిన బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్..? వరుడు ఎవరో తెలిస్తే అవ్వాల్సిందే

పెళ్లికి రెడీ అయిన బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్..? వరుడు ఎవరో తెలిస్తే అవ్వాల్సిందే


పెళ్లికి రెడీ అయిన బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్..? వరుడు ఎవరో తెలిస్తే అవ్వాల్సిందే

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ముద్దుగుమ్మ ఒకరు ఆమె కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్  రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. నటనతోనే కాదు అందంతోనూ కవ్వించింది కావ్య కళ్యాణ్ రామ్.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

ఆ తర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమా తర్వాత కావ్య కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది కావ్య.

20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

ఇదిలా ఉంటే కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి గురించి ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కావ్య పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తుంది. ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య పెళ్లి జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే.. ఈక్రమంలోనే ఇప్పుడు కావ్య కూడా పెళ్లి చేసుకోనుందని తెలుస్తుంది. మరి ఈ 27ఏళ్ల ముద్దుగుమ్మ పెళ్లి వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *