Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ బంద్.. రెడీగా ఉండండి..

Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ బంద్.. రెడీగా ఉండండి..


Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ బంద్.. రెడీగా ఉండండి..

ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం దేశాన్ని గత కొద్ది రోజులుగా కుదిపేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గల్ప్ దేశాల నుంచి భారత్‌ ఎక్కువగా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. అక్కడి అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో.. రవాణా స్తంభించిపోయింది. ఈ కారణాలతో దేశంలో గ్యాస్ కొరత వేధిస్తోండగా.. వాణిజ్య సిలిండర్ల పంపిణీని కేంద్రం నిలిచిపోయింది. కొద్ది రోజుల పాటు ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మాత్రమే డెలివరీ చేయాలని ఆదేశించింది. వాణిజ్య సిలిండర్ల పంపిణీ ఆపేయడంతో హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడుతుంది. నగరంలోని ఫుడ్ షాపులు, హోటల్స్ అన్నీ మూతవేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

రాబోయే 48 గంటల్లో బంద్

వంట గ్యాస్ కొరత వల్ల తెలంగాణలో దాదాపు 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ మూతపడతాయని తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ కోశాధికారి ఎస్ రామ్ మూర్తి వివరించారు. రాబోయే 48 గంటల్లో ఇవన్నీ మూతపడవచ్చని తెలిపారు. పెద్ద పెద్ద హోటళ్లు గ్యాస్ నిల్వలు కలిగి ఉన్నప్పటికీ.. చిన్న, మధ్య తరహా హోటళ్ల వద్ద 24 నుంచి 48 గంటలకు మాత్రమే సరిపోయేలా గ్యాస్ నిల్వలు కలిగి ఉన్నాయి. చిన్న హోటల్స్‌లో రెండు రోజులకు మాత్రమే సరిపోయే గ్యాస్ నిల్వలు మిగిలి ఉన్నాయి. దీంతో రానున్న రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా 90 శాతం ఫుడ్ పరిశ్రమ మూతపడవచ్చని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభం వస్తుందని తాము ఊహించలేదని, అందుకే ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోలేదని తెలిపారు. ఈ సంక్షోభం ఇంకెంత కాలం ఉంటుందో తమకు తెలియదని ఆయన పేర్కొన్నారు.

హాస్టళ్లు బంద్ అవుతాయా..?

ఇక నగరవ్యాప్తంగా ఎన్నో హాస్టళ్లు ఉన్నాయి. గ్యాస్ కొరత వల్ల హాస్టళ్లలో ఉండేవారు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నగరంలోని పలు హాస్టళ్లు టీ, కాఫీ, ఇతర అదనపు ఆహార పదార్ధాలను సర్వ్ చేయమని ప్రకటించాయి. గ్యాస్ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని అందిస్తామంటూ ప్రకటన చేశాయి. ఇక వారం రోజుల పాటు గ్యాస్ కొరత కొనసాగితే హాస్టళ్లు మూసివేయక తప్పదు. ఇక హోటళ్లల్లో పనిచేసే సిబ్బంది, ఫుడ్ డెలివరీ చేసే గిగ్ వర్కర్లకు కూడా ఉపాధి లభించక ఇబ్బంది పడనున్నారు. హైదరాబాద్‌లో ఒక మధ్య తరహా హోటల్ దాదాపుగా 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.  ఇప్పుడు వీరి ఉపాధికి ఆటంకం కలగనుంది. ఇలా గ్యాస్ కొరత వల్ల అనేక రంగాలు కుదేలు కానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *