
ఈ బిజీ లైఫ్‌లో చాలా మందికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం కూడా ఉండట్లేదు. అలాంటి వారికి ఇప్పుడు మేం చెప్పబోయే బ్రేక్‌ఫాస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును మీరు నైట్ మిగిలిపోయిన చపాతీలతోనే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను సింపుల్‌గా రెడి చేసుకోవచ్చు. త్వరగా భిన్నంగా ఏదైనా చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రాత్రి మిగిలిన చాపాతీతో చేసుకునే ఈ అప్పె(పొంగనాల) రోటీ బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు.మీరు దీనికి సపరేట్గా కర్రీ కూడా చేసుకుంటే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. కాబట్టి ఇంట్లో అప్పె(పొంగనాల) రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
అప్పీ( పొంగనాల) రోటీ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏమిటి?
2 పాత చెపాతీలు, 1 ఉడికించిన బంగాళాదుంప , 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి , 1/2 కప్పు బఠానీలు, 1 క్యారెట్ , 1/2 టీస్పూన్ ఎర్ర కారం,
1/2 టీస్పూన్ పసుపు, 4 టీస్పూన్ల నూనె, కొద్దిగా పచ్చి కొత్తిమీర, రుచికి ఉప్పు
అప్పీ( పొంగనాల) రోటీ ఎలా తయారు చేస్తారు?
ఈ అప్పీ రోటీ తయారు చేసేందుకు ముందుగా, రెండు చపాతీలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మెత్తగా తరిగిన ఉడికించిన బంగాళాదుంపలు, తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్లు, ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు రుబ్బిన రోటీలో వేసి కలపండి. తర్వాత పసుపు, ఎర్ర కారం, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపండి. మిశ్రమం చాలా పొడిగా అనిపిస్తే, 1-2 టేబుల్ స్పూన్ల నీరు లేదా పెరుగు వేసి కలపండి కలిపి పక్క పెట్టుకోండి.
ఇప్పుడు ఓ పొంగనాల పెంచు తీసుకొని దాన్ని గ్యాస్ మీద ఉంచి మంటను వెలిగించండి. పెంచుపై ఉన్న ప్రతి కంపార్ట్మెంట్లో 2-3 చుక్కల నూనె వేయండి. నూనె వేడి అయిన తర్వాత దానిని పిండి మిశ్రమంతో సేమ్ మనం గుంతపొంగనాలు వేసుకున్న మాదిరిగానే నిపండి. తర్వాత దానిపై మూతపెట్టి 2-3 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. అడుగు భాగం బంగారు రంగులోకి మారి క్రిస్పీగా మారినప్పుడు, ఒక చెంచా సహాయంతో వాటిని తిప్పండి. మరికొంత నూనె వేసి, మరొక వైపు మూత లేకుండా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మీ వేడి వేడి అప్పి పొంగనాల రోటీ రెడీ అయినట్టే.
(Note: పైన పేర్కన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.