Aadhaar Card: ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త కండీషన్.. పేరు, అడ్రస్ మార్చుకునేందుకు మరో రూల్.. ఇకపై అలా కుదరదు..

Aadhaar Card: ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త కండీషన్.. పేరు, అడ్రస్ మార్చుకునేందుకు మరో రూల్.. ఇకపై అలా కుదరదు..


Aadhaar Card: ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త కండీషన్.. పేరు, అడ్రస్ మార్చుకునేందుకు మరో రూల్.. ఇకపై అలా కుదరదు..

ఆధార్ కార్డు అనేది భారతదేశంలో నివసించే ప్రతీవ్యక్తికి అవసరమైన ప్రధాన డాక్యుమెంట్ అనేది తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ఏదైనా పొందేందుకు ఇది తప్పనిసరి. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతీ సేవకు అవసరమయ్యే ఈ కార్డు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో డాక్యుమెంట్‌లో ఒక్కొలా వివరాలు ఉంటే లింక్ చేసుకోవడంలో ప్రాబ్లం ఎదుర్కొవచ్చు. ఇక వివరాలు తప్పుగా ఉంటే ఆధార్ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు.

కొత్త కండీషన్స్ అమలు

ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవడంపై యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది. పేరు, పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేసుకునేందుకు కొత్త కండీషన్స్ అమలు చేస్తోంది. ఇక నుంచి ఎన్నిసార్లు అయినా వివరాలను అప్డేట్ చేసుకోవడానికి కుదరదు. జీవితంలో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్‌ను ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇక అడ్రస్‌ను ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశముంది. అడ్రస్ మార్పునకు మాత్రం యూఐడీఏఐ ఎలాంటి షరతులు విధించలేదు.

ఈ పత్రాలు తప్పనిసరిగా అవసరం

అయితే డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరం. ఇక అడ్రస్ మార్చుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డ్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటివి ఉపయోగపడతాయి. ఇక పాస్ పోర్ట్ వంటి గుర్తింపు డాక్యుమెంట్స్ కూడా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి సహాయపడతాయి. చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఒకచోట.. ఇప్పుడు మరొచోట నివసిస్తున్నారు. ఇక చాలామంది ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ ఉంటారు. ఇలాంటివారు ఆధార్‌లోని చిరుమాను మార్చుకోవడం అవసరం. దీని వల్ల ప్రభుత్వ సేవలను వేగవంతంగా పొందవచ్చు.

ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది

ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులువుగా మారింది. ఇటీవల కేంద్రం ఆధార్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచి సేవలు పొందవచ్చు. మొబైల్ నెంబర్, పేరు, అడ్రస్ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. గతంలో తరహాలోనే ఆధార్ సెంటర్‌కు వెళ్లి క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *