Bandla Ganesh: ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా అతడు ఏమన్నాడంటే

Bandla Ganesh: ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా అతడు ఏమన్నాడంటే


Bandla Ganesh: ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా అతడు ఏమన్నాడంటే

నిర్మాత బండ్ల గణేష్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, తాను మాస్ మహారాజా రవితేజను మోసం చేసినట్లు సంచలనంగా అంగీకరించారు. ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో రవితేజకు ప్రభుత్వం అక్యూజేషన్ చేస్తోందని అబద్ధం చెప్పి, ఆయన నుంచి పొలం తీసుకున్నానని వివరించారు. ఈ విషయాన్ని తర్వాత రవితేజకు స్వయంగా చెప్పి క్షమాపణ కోరానని, అయితే రవితేజ “నాకు తెలుసురా” అని బదులిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. తాను రవితేజకు చేసిన ఈ “మోసం”కు ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటానని గణేష్ పేర్కొన్నారు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

రవితేజ నిజాయితీ, కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి అని గణేష్ ప్రశంసించారు. చిరంజీవి తర్వాత డబ్బు విలువ తెలిసిన, తమ కుటుంబాలను ప్రేమగా చూసుకునే అతి కొద్ది మంది సినీ ప్రముఖుల్లో రవితేజ ఒకరని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. స్కూటర్‌పై తిరగడం నుంచి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయిన రవితేజ, మెస్‌లో కలిసి భోజనం చేసిన రోజుల నుంచి నేటి వరకు ఆయన ప్రయాణం తనకు తెలుసని గుర్తు చేసుకున్నారు. తాను చిన్న చిన్న వేషాలు వేస్తున్న రోజుల్లో “మనసిచ్చి చూడు,” “మనసులో మాట,” “సింధూరం” వంటి సినిమాల్లో కలిసి పని చేశామని, ఆ తర్వాత ఈ.వి.వి. సత్యనారాయణ “నేను ప్రేమిస్తున్నాను” సినిమాతో తనకు మంచి అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు రవితేజకు సినిమాల విషయంలో గ్యాప్ వచ్చిందని, ఆ సమయంలో తాను వెళ్లి రవితేజతో “ఆంజనేయులు” సినిమా తీశానని బండ్ల గణేష్ వెల్లడించారు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా తనకు రూ. 5 కోట్లు లాభం మిగిలిందని, 110 రోజుల్లోనే సినిమా రిలీజ్ చేశామని తెలిపారు. ఆ సినిమాను చూసిన తర్వాత సినిమా అంటే ఇంత ఈజీనా? అనిపించిందని అన్నారు. సాధారణంగా ఎదురుదెబ్బ తగిలితే భయపడతామని, కానీ తనకు మొదట ఎదురుదెబ్బ తగల్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *