
ఇరాన్‌కు చెందిన టెహ్రాన్ టైమ్స్ కథనం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది. ‘‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’’ అంటూ చిన్నారుల ఫొటోలను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్ దాడిని అంగీకరించడం లేదంటూ ఇరాన్ ప్రభుత్వం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికా క్షిపణి దాడుల్లో చిన్నారులు మరణించారని ఇరాన్ అంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ నెపాన్ని ఇరాన్‌పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ఆయుధాలకు కచ్చితత్వం ఉండదంటూ, మినాబ్ స్కూల్‌పై దాడి ఘటనకు ఆ దేశానిదే బాధ్యతంటూ మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు. దానికి ఇరాన్ ప్రభుత్వం ఫొటోలతో ఇలా బదులిచ్చింది. టెహ్రాన్ టైమ్స్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జీవితంలో ఎన్నో చూడాల్సిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ కొందరు భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు. ఈ దాడికి కారణమైన ట్రంప్, క్షిపణులు తయారుచేసిన వారు, దానికి సాంకేతిక సాయం అందించిన అందరూ బాధ్యులేనంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. అయితే, ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన వారి మాటేంటి? అంటూ మరికొందరు యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోతుండడంపై అంతర్జాతీయంగా ఆందోళన చెలరేగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్.. అమెరికాపై దాడులకు కుట్ర ??
బెంజ్ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు
కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!
భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా
హోటల్ చెక్ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు