
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన జరిగింది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక వ్యక్తి 50 రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొన్నాడు. అతని టికెట్ కి రూ.30 లక్షల లాటరీ తగిలింది. కానీ లాటరీ టిక్కెట్ కొన్న ఆ వ్యక్తి మాత్రం ఎవరో తెలియడం లేదు. ఈ ఆసక్తికర సంఘటన పంజాబ్ రాష్ట్రం బర్నాలాలో జరిగింది. అతని ఆచూకీ కోసం నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మైకులు, డప్పులతో గల్లీలలో చాటింపు వేయిస్తున్నారు. నెలవారీ లాటరీ నిర్వహించే ఒక సంస్థ ఫిబ్రవరి 26న విజేతలను ప్రకటించింది. బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఏజెంట్ వద్ద కొనుగోలు చేసిన నెంబరుకు లాటరీ తగిలింది. కానీ ఆ టిక్కెట్‌పై కొనుగోలు చేసిన వారి పేరు, ఫోన్ నెంబర్ వివరాలు లేవు. కమీషన్ కింద ఏజెంటుకు రూ.1 లక్ష అందచేశారు. అయితే విజేతను ప్రకటించిన నెల రోజుల్లోగా ప్రైజ్ మనీ తీసుకోని పక్షంలో అది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. అందుకే, ఈ లాటరీ తగిలిన వ్యక్తి కోసం ఆ ఏజెంటు గల్లీ గల్లీ తిరుగుతూ మైకులు, డప్పు చప్పుల్లతో చాటింపు వేయిస్తున్నాడు. లాటరీ తగిలిన వ్యక్తి వస్తే ప్రైజ్ మనీ ఇవ్వడం కోసం ప్రాంగణాన్ని బెలూన్లతో అలంకరించారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం స్థానికంగా ఆసక్తిని రేపింది. దీంతో స్థానికంగా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..
విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం
TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..
Allu Arjun Fans Meet: కరీంనగర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం
ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..