విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం


విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం

కొత్త పార్టీ పెట్టి కొద్ది రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న నటుడు విజయ్‌కు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 8 మహిళా దినోత్సవం నాడు తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై విజయ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. విజయ్ వైఖరిని పార్టీ మహిళా విభాగం నేత రంజన నాచియార్ తీవ్రంగా తప్పుబట్టారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో రంజన విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సొంత భార్యకు గౌరవం ఇవ్వని వ్యక్తి, ఇతర మహిళలను గౌరవిస్తారని ఎలా నమ్మాలి?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్లుగా కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లయిన భార్య గురించి ‘అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయం’ అన్నట్లుగా మాట్లాడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఇలాంటి వ్యాఖ్యలు యువతకు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విడాకుల కేసు నడుస్తున్న సమయంలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక వివాహ వేడుకకు హాజరుకావడాన్ని కూడా ఆమె విమర్శించారు. రాజకీయాల కంటే కుటుంబానికి ఇచ్చే గౌరవమే ముఖ్యమని, ఆయన చర్యలు యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని అన్నారు. విడాకుల వ్యవహారంపై దళపతి విజయ్ స్పందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో తన వ్యక్తిగత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని, కార్యకర్తలు వాటి గురించి ఆందోళన చెందవద్దని కోరారు. తన విషయాల వల్ల అభిమానులు ఒత్తిడికి గురవ్వడం బాధ కలిగిస్తోందని, అందరూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు. భార్యాభర్తల బంధానికి విజయ్‌ ద్రోహం చేశారని, గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, విజయ్ నుంచి విడాకులు ఇప్పించమని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఏప్రిల్‌ 20న దీనిపై విచారణ జరగనుంది. అదే రోజు విజయ్‌ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. తమిళ రాజకీయాల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..

Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *