Rapido: భారతదేశంలో అతిపెద్ద, అందుబాటు ధరల మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగిన Rapido ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణాలకు కీలక భాగస్వామిగా మారుతోంది. నగరంలో ప్రయాణించే ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలను సులభంగా పూర్తి చేసుకునేందుకు రాపిడో మొదటి మైలు, చివరి మైలు ప్రయాణాలను కలిపే ముఖ్యమైన సేవగా నిలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 1.5 లక్షలకుపైగా రాపిడో రైడ్లు మెట్రో స్టేషన్లతో అనుసంధానమై జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రయాణికులు తమ ఇంటి నుండి మెట్రో స్టేషన్‌కు చేరుకోవడానికి లేదా మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి రాపిడో బైక్‌లు, ఆటోలను విస్తృతంగా వినియోగిస్తున్నారని తేలింది. అంతేకాకుండా, రాపిడో యాప్ ద్వారా రోజుకు దాదాపు 30,000 మెట్రో టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇది నగరంలో సమగ్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని చూపిస్తోంది. రాపిడో కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో ఒక కీలక భాగమైపోయింది.
రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ, నగర రవాణా వ్యవస్థ సజావుగా పనిచేయాలంటే ప్రయాణం సులభంగా, నిరంతరంగా ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రయాణికులు మెట్రో ప్రయాణాన్ని రాపిడో బైక్‌లు, ఆటోలతో కలిపి వేగంగా, సమయపాలనతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా బహుళ రవాణా విధానాలను సులభంగా వినియోగించుకునేలా చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మొత్తం కలిపి రోజుకు 10 లక్షలకు పైగా రాపిడో రైడ్లు నమోదవుతున్నాయట. దీంతో నగర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రాపిడో ఒకటిగా నిలుస్తోంది. ప్రయాణికులకు సౌకర్యం, సమయ ఆదా ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇకపై ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, ఒకే యాప్‌లో టికెట్ బుకింగ్‌తో పాటు రైడ్ సదుపాయం అందుబాటులో ఉండటం మెట్రో ప్రయాణాన్ని మరింత అలవాటుగా మారుస్తోంది.
దీనికి అనుగుణంగా రోజువారీ వినియోగ ధోరణులు కూడా మారుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగే మొత్తం రాపిడో రైడ్లలో దాదాపు సగం రైడ్లు కార్యాలయాలు, కళాశాలల పీక్ అవర్స్‌లోనే జరుగుతున్నాయి. ఇది రాపిడో సేవలు సాధారణ రవాణా కంటే రోజువారీ ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతులుగా మారుతున్నాయని సూచిస్తోంది. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో విస్తరిస్తున్న నేపథ్యంలో రాపిడో నగరంలోని ఇళ్లు, వీధులు, మెట్రో స్టేషన్లను కలిపే కీలక కనెక్టివిటీ లేయర్‌గా మరింత ప్రాధాన్యం పొందే అవకాశముంది.




