దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్


దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తికాగా.. నిర్ణయాన్ని ప్రకటించారు.

సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. ఒకరోజు ముందే.. స్పీకర్ కడియం, దానం నాగేందర్‌ పై దాఖలైన రెండు పిటిషన్లను డిస్మిస్ శారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *