Kalisundam Raa: 26 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలిసుందాం రా’ రికార్డులు.. ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kalisundam Raa: 26 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలిసుందాం రా’ రికార్డులు.. ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?


Kalisundam Raa: 26 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలిసుందాం రా’ రికార్డులు.. ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో రికార్డులు అనగానే ముందుగా గుర్తొచ్చేది మాస్ హీరోలు. కానీ, ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా, ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసిన ఘనత ‘విక్టరీ’ వెంకటేష్‌ది. కమర్షియల్ లెక్కలతో సంబంధం లేకుండా ఆయన నటించిన ‘కలిసుందాం రా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తవుతున్నా, అప్పట్లో ఈ చిత్రం క్రియేట్ చేసిన ఒక సెన్సేషనల్ రికార్డును చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలు సైతం ఇప్పటికీ బ్రేక్ చేయలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఆ రికార్డును ఎవరైనా టచ్ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అసలు ఏంటా రికార్డు అని చూస్తే.. ఒక సినిమా విడుదలైన ‘అన్ని’ కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు పూర్తి చేసుకోవడం. ‘కలిసుందాం రా’ సినిమా అప్పట్లో డైరెక్ట్‌గా 74 సెంటర్లలో విడుదలైంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన మొత్తం 74కి 74 కేంద్రాల్లో 50 రోజులు, అలాగే అవే 74 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో రిలీజ్ అయిన ప్రతి థియేటర్‌లోనూ సెంచరీ కొట్టిన ఏకైక తెలుగు సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఒక కుటుంబ కథా చిత్రానికి అన్ని సెంటర్లలో ఒకేస్థాయిలో బ్రహ్మరథం పట్టడం టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని అరుదైన రికార్డు. డైరెక్ట్ రిలీజ్ సెంటర్లలోనే కాకుండా.. లేట్ రిలీజ్‌లతో అంటే షిఫ్టింగ్ కలుపుకుని ఈ సినిమా లాంగ్ రన్‌లో క్రియేట్ చేసిన రికార్డులు మతిపోగొడతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం అప్పట్లో 103 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని సత్తా చాటింది. అక్కడితో ఆగకుండా 35 కేంద్రాల్లో 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ, ఏకంగా 20 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శించబడి టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది.

వైజాగ్, కృష్ణా, నెల్లూరు లాంటి ఏరియాల్లో వరుసగా ఎన్నో థియేటర్లలో డైరెక్ట్ 100 రోజులు ఆడిన సినిమాగా వెంకీ మామ స్టామినాను ఇండస్ట్రీకి నిరూపించింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఉదయశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలను మార్చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కేవలం 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 20 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన తొలి సినిమాగా సరికొత్త మైలురాయిని సెట్ చేసింది. అంతకు ముందు ఏడాది వచ్చిన బాలయ్య ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రికార్డులన్నింటినీ ఈ ఫ్యామిలీ సినిమా క్లీన్ స్వీప్ చేసేయడం అప్పట్లో ఒక సంచలనం.

బాక్సాఫీస్ నంబర్లనే కాకుండా అవార్డుల పంట కూడా పండించింది కలిసుందాం రా సినిమా. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు, ఏకంగా 4 నంది అవార్డులను కైవసం చేసుకుంది. వెంకటేష్-సిమ్రాన్ పెయిర్, కె. విశ్వనాథ్ గారి నటన, ఎస్.ఏ. రాజ్ కుమార్ అందించిన ఎవర్‌గ్రీన్ మ్యూజిక్ ఈ సినిమాను ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా మార్చాయి. పాన్ ఇండియా పేరిట ఇప్పుడు వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలు సైతం థియేటర్లలో రెండు, మూడు వారాలు మించి నిలబడలేకపోతున్న ఈ రోజుల్లో.. 26 ఏళ్ల క్రితం కలిసుందాం రా సెట్ చేసిన ఈ ఆల్ రిలీజ్డ్ సెంటర్స్ 100 డేస్ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమనే చెప్పాలి.

కాగా కలిసుందాంరా సినిమాను మొదట అక్కినేని నాగార్జున దగ్గరకు వచ్చిందట. అయితే అప్పటికే ఆయన ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో విక్టరీ వెంకేటష్ దగ్గరకు వెళ్లిందట. అలా నాగ్ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారట.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *