RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే


RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మార్చి 11: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు ఈ వారంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ మరో 2 రోజుల్లో అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. మార్చి 16 నుంచి మార్చి 27వ తేదీ వరకు ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటలకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12.45 గంటలకు, మూడవ షిఫ్ట్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంటన్నర ముందుగానే సంబంధిత కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది.

అభ్యర్ధులందరికీ ఒకే సారి అడ్మిట్‌ కార్డులు విడుదల చేయమని, పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందుగా మాదే అడ్మిట్ కార్డులు విడివిడిగా జారీ చేస్తామని ఆర్‌ఆర్‌బీ తెలిపింది. అంటే మార్చి 16 తేదీన పరీక్ష ఉన్న అభ్యర్థులు మార్చి 13 నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నమాట. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్ నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌ కార్డుతోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమతోపాటు అభ్యర్ధులు తప్పనిసరిగా తీసుకురావల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్ధులంతా పరీక్షలకు సంబంధించిన ఇతర సూచనలను అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత అందులోని మార్గదర్శకాల ఆధారంగా పాటించాలని బోర్డు సూచించింది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *