కావాల్సిన పదార్ధాలు: వామాకులు, శనగపిండి, మసాలా పొడి, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని తీసుకోవాలి.
ముందుగా వామాకులను నీటితో శుభ్రపరిచి కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అర టీ స్పూన్ వాము, ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా కలపాలి.
ఒక గ్లాస్ నీళ్లు పోస్తూ, పచ్చి మిర్చి పకోడీ పిండిలాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపితే పకోడీ బాగా వస్తుంది.
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అది వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలుగా వేసి గోల్డ్ కలర్ లోకి మారే వరకు బాగా వేయించాలి.
వేయించిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి వామాకుల పకోడీలు రెడీ. వీటిని తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.




