
నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రయాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ సెక్షన్ 67, బీఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పర్పుల్ క్రయాన్ అకౌంట్ హోల్డర్ ఎవరో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 5, 6 తేదీల నుంచి ఈ తరహా కామెంట్స్ వస్తున్నాయని, అవి పెరిగిపోవడంతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్
Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా
Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు
Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా
Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ