మీ అరచేతిలో ఈ గీత ఉందా.. పెళ్లి ఎప్పుడు.. లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉంటారో ఇలా తెలుసుకోండి..

మీ అరచేతిలో ఈ గీత ఉందా.. పెళ్లి ఎప్పుడు.. లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉంటారో ఇలా తెలుసుకోండి..


మీ అరచేతిలో ఈ గీత ఉందా.. పెళ్లి ఎప్పుడు.. లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉంటారో ఇలా తెలుసుకోండి..

మా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందా లేక కలహాలతో సాగుతుందా? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంటాయి. వీటి సమాధానాల కోసం చాలామంది జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మీ భవిష్యత్తు మీ అరచేతిలోనే దాగి ఉందని మీకు తెలుసా? మన చేతిలోని వివాహ రేఖ మన జీవిత భాగస్వామి గురించి, పెళ్లి సమయం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంది. హస్తసాముద్రికం ప్రకారం.. చిటికెన వేలు కింది భాగంలో, హృదయ రేఖకు పైన అడ్డంగా ఉండే చిన్న రేఖనే వివాహ రేఖ అంటారు. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా, ఎరుపు రంగులో ఉంటే.. ఆ వ్యక్తి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా, అన్యోన్యంగా సాగుతుందని అర్థం. ఒకవేళ ఈ రేఖ అస్పష్టంగా ఉన్నా లేదా గొలుసుకట్టు ఆకారంలో ఉన్నా.. సంబంధాల్లో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడు రేఖలు ఉంటే మూడు పెళ్లిళ్లా?

సాధారణంగా ప్రజల్లో ఒక పెద్ద అపోహ ఉంది. చేతిలో మూడు రేఖలు ఉంటే మూడు పెళ్లిళ్లు చేసుకుంటారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. క్లాసికల్ పరిశోధనల ప్రకారం.. ఈ అదనపు రేఖలు మీ జీవితంలో ఏర్పడే లోతైన ప్రేమ సంబంధాలను లేదా బలమైన భావోద్వేగ అనుబంధాలను సూచిస్తాయి. రెండు రేఖలు సమాంతరంగా, సమాన లోతులో ఉంటేనే బహుళ వివాహాలకు అవకాశం ఉంటుంది. లేదంటే అవి కేవలం స్వల్పకాలిక బంధాలను మాత్రమే సూచిస్తాయి.

పెళ్లి ఎప్పుడు జరుగుతుంది?

మీకు త్వరగా పెళ్లి అవుతుందా లేక ఆలస్యమా? అనేది తెలుసుకోవడానికి ఒక సులభమైన సూత్రం ఉంది. హృదయ రేఖ నుండి చిటికెన వేలు మూలం వరకు ఉన్న దూరాన్ని 50 ఏళ్లుగా పరిగణించాలి.
వివాహ రేఖ సరిగ్గా మధ్యలో ఉంటే 25 నుండి 27 ఏళ్ల మధ్య వివాహం జరుగుతుంది. రేఖ హృదయ రేఖకు దగ్గరగా ఉంటే త్వరగా చిటికెన వేలు వైపు ఉంటే ఆలస్యంగా వివాహం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.

గమనించాల్సిన హెచ్చరిక గుర్తులు

జాతక చక్రంలో లాగే అరచేతిలో కూడా కొన్ని గుర్తులు హెచ్చరికలను జారీ చేస్తాయి..

ద్వీపం: రేఖ మధ్యలో ద్వీపం వంటి గుర్తు ఉంటే వైవాహిక జీవితంలో విడిపోయే ప్రమాదం లేదా పెద్ద అడ్డంకులు ఎదురుకావచ్చు.

క్రిందికి వాలుగా ఉంటే: వివాహ రేఖ కిందికి వంగి హృదయ రేఖను తాకితే అది జీవిత భాగస్వామి అనారోగ్యాన్ని సూచిస్తుంది.

క్రాస్: రేఖపై క్రాస్ లేదా పుట్టుమచ్చ ఉంటే అకస్మాత్తుగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది.

హస్తసాముద్రికం అనేది ఒక మార్గదర్శి మాత్రమే. రేఖలు మన ప్రవృత్తిని సూచించినప్పటికీ, మనిషి చేసే పనులు, ఆలోచనా విధానం ద్వారా తన విధిని తానే మార్చుకోగలడు. కాబట్టి రేఖలను చూసి నిరాశ పడకుండా, అప్రమత్తంగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడమే విజ్ఞత.

(గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అందించడం జరిగింది. TV9 దీనికి బాధ్యత వహించదు. )



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *