Headlines

Aadhaar Card: ఆధార్ కార్డుపై కొత్త రూల్స్.. ఈ వివరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు.. ఇకపై అలా కుదరదు..

Aadhaar Card: ఆధార్ కార్డుపై కొత్త రూల్స్.. ఈ వివరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు.. ఇకపై అలా కుదరదు..


Aadhaar Card: ఆధార్ కార్డుపై కొత్త రూల్స్.. ఈ వివరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు.. ఇకపై అలా కుదరదు..

ఆధార్ కార్డ్ అనేది దేశంలో నివసించే ప్రతీఒక్క వ్యక్తికి అవసరమైన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు ధృవీకరణ డాక్యుమెంట్ అనేది అందరికీ తెలిసిందే. వివిధ ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డు పొందటానికి మాత్రమే అర్హులు. స్వచ్చంధంగా ఆధార్ కోసం ఒకసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిల్లో అడ్రస్, పేరు, మొబైల్ నెంబర్, తండ్రి పేరు లాంటి వివరాలు తప్పుగా ఉంటే మార్చుకునే అవకాశముంది. కానీ కొన్ని వివరాలను జీవితంలో ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశముంది. ప్రతీసారి అప్డేట్ చేసుకోవడానికి కుదరదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వీటికి ఒక్కసారి మాత్రమే మార్చుకోగలరు

ఆధార్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబర్, పేరు, తండ్రి పేరు, ఫొటో, బయోమెట్రిక్ వివరాలు వంటి వాటిని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. కానీ యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డులోని లింగం, పుట్టిన తేదిని ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశముంది. ప్రతీసారి మార్చుకోవడానికి కుదరదు. చాలామంది ప్రభుత్వ పథకాలను పొందేందుకు డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి అక్రమాలు చాలా జరిగాయి. దీనికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతీసారి డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకునే విధానాన్ని నిలిపివేసింది. ఒక్కసారి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే రూల్‌ను ప్రవేశపెట్టింది. కొంతమంది వయస్సును పెద్దగా చూపించి పింఛన్ వంటి ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందుతున్నారు. యూఐడీఏఐకు దీనిపై ఫిర్యాదులు రావడంతో.. రూల్స్ మార్చింది. ఇక లింగాన్ని కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకోగలరు.

మొబైల్ యాప్ ద్వారా..

ఇటీవల యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకోవచ్చు. కానీ అందుకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టెన్త్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను అప్డేట్ చేస్తారు. గతంలో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉండవు. దీంతో సదూరంలో ఉన్న పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఆధార్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారానే వివరాలన్నీ అప్డేట్ చేసుకునేందుకు యాప్‌ను ప్రవేశపెట్టింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *