సాధారణంగా మనం దేవుళ్ళకు గుడి కడుతుంటాము. ఇంకా చెప్పాలంటే దేవతలకు కూడా దేవాలయాలు నిర్మించి పూజలు ఘనంగా నిర్వహిస్తాము. హిందూ సంప్రదాయంలో ఇదొక ఆచారం లాగా కొనసాగుతూ వస్తుంది. కానీ, అక్కడ ఓ ప్రదేశంలో ఏలియన్లకు గుడి నిర్మించారు.
అయితే, ఈ ప్రపంచంలో ఒక ప్రదేశంలో ఏలియన్లకు గుడిని నిర్మించి పూజలు చేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. మరి, ఇదెక్కడ ఉందో తెలుసుకుందాం..
తమిళనాడులో మల్లమూపంబట్టిలో ఏలియన్స్‌కు ఓ గుడిని అద్భుతంగా నిర్మించారు. ఇంకా ఈ దేవాలయంలో శివపార్వతులు విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు.
11 అడుగుల భూగర్భంలో ఈ గుడిని కట్టించారు. అక్కడి వారికీ ఈ ఆలయం గురించి తెలియడంతో రోజూ వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసి కోరికలు తీర్చమని అడుగుతున్నారు.
ఈ గుడిని కట్టించిన అతను మాట్లాడుతూ నమ్మలేని నిజాలను చెప్పాడు. తాను గ్రహాంతర వాసులతో మాట్లాడానని, ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు వారి అనుమతి కూడా తీసుకున్నానని చెబుతున్నాడు. ప్రకృతి విలయతాండవం ఆడేటప్పుడు గ్రహాంతర దేవతలు మాత్రమే కాపాడగలవని నమ్ముతున్నట్లు ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.




