కొత్త ఏడాదిలో 12 రాశుల్లో వృషభ రాశి వారికి కొత్త కష్టాలు మొదలవ్వనున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, వీరు ఉగాది ముందు ఈ పరిహారాలు చేస్తే ప్రతికూలంగా ఉంటుందని అంటున్నారు.
ఉగాది పండుగ ముందు రోజు వృషభ రాశి వారు ఈ పరిహారాలు చేస్తే కొంత వరకు మంచిగా ఉంటుందని అంటున్నారు. ఆ రోజున వీళ్ళు నువ్వుల నూనెతో ఉదయాన్నే స్నానం చేయాలి. అలాగే, ఉగాది రోజున మీ ఇంటి ముందుకు లక్ష్మి దేవి రావాలంటే అందమైన ముగ్గులు వేయండి.
ఉగాది ముందు రోజు పూజ చేసి హారతి ఇచ్చి ఇంటి ముందు అగరబత్తీలను వెలిగించండి. అలాగే, ఇల్లు మొత్తం సాంబ్రాన్ పొగ వేయండి. ఇలా చేస్తే ఇళ్లు మొత్తం పాజిటివ్ గా మారుతుంది.
మీ పూజ గదిలో వినాయకుడి ఫోటో పెట్టి పూజ చేయండి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయాలి ఆ రోజున ఎలాంటి గొడవలు పడొద్దు. ఇలా చేస్తే అందరూ మంచి ఫలితాలను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




