Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా

Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా


Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా

వెంకటేష్ దృశ్యం 3 సినిమాని తెలుగులో రీమేక్ చేయకపోవడానికి కారణం త్రివిక్రమా..? మాటల మాంత్రికుడి సినిమా కారణంగానే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వెంకీ తప్పుకున్నారా..? వెంకీ కోసం గురూజీ తన రొటీన్ ట్రాక్ పక్కన బెట్టారా..? అందుకే దృశ్యం 3 సినిమాను వెంకటేష్ పక్కనబెట్టారా..? అసలేంటి ఈ కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా.. లేటెందుకు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకుంటున్నారంతా. కానీ మల్లీశ్వరి మార్క్ కామెడీ.. నువ్వు నాకు నచ్చావ్ ఛమక్కులతో పాటు ఊహించని మలుపులు కూడా ఉండబోతున్నాయి. ఈసారి రొటీన్ ఫ్లాట్ నెరేషన్‌కి భిన్నంగా గురూజీ సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే ట్విస్టులు, టర్నులతో కూడిన ఒక సాలిడ్ స్టోరీని వెంకీ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ కథ వల్లే దృశ్యం 3 తెలుగు రీమేక్‌ను వెంకటేష్ పక్కన పెట్టారా అనే చర్చ మొదలైందిప్పుడు. త్రివిక్రమ్ సినిమాలోనూ అదే రేంజ్ సస్పెన్స్, ట్విస్టులు ఉన్నప్పుడు.. వెంటనే మళ్లీ దృశ్యం లాంటి మరో థ్రిల్లర్ సినిమా ఎందుకనే ఉద్దేశ్యంతోనే వెంకీ ఆ రీమేక్‌కు నో చెప్పారేమో అనిపిస్తుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడం.. గురూజీ తన స్టైల్ మార్చుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఓవైపు కామెడీ.. మరోవైపు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో రెడీ అవుతున్న ఈ సినిమా.. థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. పైగా వెంకీ కూడా సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో ఫామ్‌లో ఉన్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??

Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్

వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా

Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *