పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అనర్హులను గుర్తించే ప్రక్రియను కేంద్రం ఎప్పటికప్పుడు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అనర్హులుగా తేలిన వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. అందులో భాగంగా తాజాగా మరికొంతమంది పేర్లను కేంద్రం తొలగించింది. వీరిలో తెలంగాణ నుంచి 32 వేల మంది లబ్దిదారులు ఉన్నారు.
వీళ్లు అక్రమంగా పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అందుకే లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. నిబంధనలను విరుద్దంగా వీరు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్నట్లు తేలింది. అర్హత లేకపోయినా అక్రమ మార్గాల్లో లబ్ది పొందుతున్నట్లు రీవెరిఫికేషన్ కార్యక్రమంలో అధికారులు గుర్తించారు.
వీరిలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, భూమిని విక్రయించినవారు ఎక్కువమంది ఉన్నారు. దీంతో వీరికి పీఎం కిసాన్ నిధులను కేంద్రం కట్ చేయనుంది. మార్చి 13న జమ కానున్న పీఎం కిసాన్ 22 విడత సొమ్ము వీరి ఖాతాల్లో జమ చేయడం లేదని తెలుస్తోంది. 21 విడతలో 30.08 లక్షల అకౌంట్లలో కేంద్రం నిధులు జమ చేసింది.
అయితే ప్రస్తుతం చాలామందిని అనర్హులను జాబితా నుంచి రిమూవ్ చేయడంలో ఈ సారి సంఖ్య తగ్గనుంది. అనర్హులపై ఫిర్యాదులు అందటంతో అధికారులు పరిశీలించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. చాలామంది తమ భూములను అమ్ముకున్నా పీఎం కిసాన్ పొందుతున్నారు. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా కేంద్రం నుంచి నగదు పొందుతున్నారు.
ప్రతీ సంవత్సరం ఫిర్యాదులు అందిన 10 శాతం మంది లబ్దిదారులును కేంద్రం పరిశీలిస్తోంది. వారిని అనర్హులుగా గుర్తించి పీఎం కిసాన్ కట్ చేస్తోంది. ఇక 5 ఎకరాలు కంటే ఎక్కువ పోలం ఉన్నవారు, కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ పీఎం కిసాన్ పొందటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో కేంద్రం చర్యలు చేపడుతోంది.




