Vande Bharat Sleeper: ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!

Vande Bharat Sleeper: ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!


Vande Bharat Sleeper: ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!

Vande Bharat Sleeper Rrains: దూర ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఒక పెద్ద అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపడానికి ఇప్పుడు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రైళ్లను రాత్రిపూట ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తారు. BEML, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సంయుక్తంగా ఈ రైళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. 2026 చివరి నాటికి అలాంటి 12 రైళ్లు పనిచేయడం ప్రారంభిస్తాయి.

ఛార్జీలు, టికెట్ బుకింగ్ నియమాలు ఏమిటి?

ఈ కొత్త రైళ్లకు సంబంధించి రైల్వేలు ఇప్పటికే ఉన్న నియమాలను గణనీయంగా సవరించాయి. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు మెరుగుపర్చారు. కానీ బుకింగ్ ప్రక్రియ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. రైల్వే బోర్డు ప్రకారం.. దూరం ఆధారంగా ఛార్జీలు నిర్ణయిచారు.

Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌.. వారానికి 4 రోజులే పని!

ఇక వెయిటింగ్‌ అవసరం లేదు:

  • ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. RAC అనేది లేకుండా రైల్వే చర్యలు చేపడుతోంది. ప్రయాణికులకు కన్ఫర్మ్‌ సీట్లు మాత్రమే ఉంటాయి.
  • డిజిటల్ బుకింగ్: టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా డిజిటల్‌గా మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
  • ఛార్జీ: కనీసం 400 కిలోమీటర్ల ప్రయాణ ఛార్జీ వర్తిస్తుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3AC ఛార్జీ సుమారు రూ.960 ఉంటుంది. మీరు ప్రయాణించే దూరం బట్టి ఛార్జీలు ఉంటాయని గుర్తించుకోండి.
  • వృద్ధులకు ఉపశమనం: ఈ వ్యవస్థ 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు దిగువ బెర్తులకు ప్రాధాన్యత ఇస్తుంది.

ఎంత వేగం?

వందే భారత్ స్లీపర్ రైళ్లు వేగం, భద్రతలోనూ రాజధాని రైళ్లను అధిగమిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భద్రత కోసం ఇందులో ‘KAVACH’ వ్యవస్థ, అగ్ని నివారణ కోసం ప్రత్యేక అగ్ని నిరోధక డోర్స్‌ ఉపయోగించారు. కోచ్ లోపల గాలిని శుభ్రంగా ఉంచడానికి, క్రిములను తొలగించడానికి UV-C దీపాలను ఉపయోగించారు. వికలాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందించారు. అలాగే ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి సౌకర్యవంతమైన మెట్లను నిర్మించారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *