స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..


స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పారు. సొంత పనుల కోసం విద్యార్థులను వాడుకుంటూ అభాసుపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాఠశాల గదిలోనే విద్యార్థినులతో కాళ్లు పట్టించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు, ఇలా అధికార గర్వంతో ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్వి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధు కుమారి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే, ఆమె క్లాస్ రూమ్‌లోనే విద్యార్థినులతో తన నడుము, కాళ్లు మరియు పాదాలను తొక్కించుకుంటూ మసాజ్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. తనిఖీ బృందం వెళ్ళే సమయానికి సదరు టీచర్ ‘సిక్ లీవ్’లో ఉన్నట్లు తెలిసింది. అయితే, అధికారులు విద్యార్థుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు మధు కుమారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్నట్లుగా ఉన్న వీడియోపై ఆ టీచర్ స్పందించారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఎవరో కావాలనే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’, డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ఆ దృశ్యాలను సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, విద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఈ వివాదంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలోని వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *