Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే


Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

వేసవిలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతాయి. కానీ మార్చి తొలి వారంలోనే ఆ తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగా మండుతున్నాడు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవి ఎలా ఉంటుందా అని భయపడుతున్నారు. కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలలో నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధి గ్రాస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వర్షాలతో పాటు, చలి, ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు, చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యప్రతాపం చూపిస్తుండటంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే

అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *