Headlines

PM e Drive: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక రయ్‌ రయ్ మంటూ దూసుకెళ్లడమే..

PM e Drive: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక రయ్‌ రయ్ మంటూ దూసుకెళ్లడమే..


PM e Drive: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక రయ్‌ రయ్ మంటూ దూసుకెళ్లడమే..

దేశంలో రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఇబ్బందులు లేకండా దేశవ్యాప్తంగా ఉన్న హైవేలపై ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డైవ్ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఈ పథకం కింద రాష్ట్రంలోని జాతీయర రహదారులపై దశల వారీగా 444 ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాధించింది. ఇందుకోసం విద్యుత్ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, జెన్‌కో, డిస్కంలకు దగ్గరగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదినను పరీశీలించిన కేంద్ర బృందాలు దాదాపు 200 లొకేషన్లను పరిశీలించి తొలి దశలో రాష్ట్రంలో 135 చోట్ల ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ కేంద్రాల్లో దాదాపు 600 ఛార్జింగ్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేయబోయే ప్రతి ఛార్జింగ్ కేంద్రంలో బైక్ నుంచి భారీ వాహనాల దాకా అన్నింటికి చార్జింగ్ సదుపాయలు కల్పించనున్నారు. ఇంకోసం ఏప్రిల్ టెండర్లపు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పనున్నారు. ఇక పనులు మొత్తం పూర్తై ఆగస్ట్ నాటికి ఈ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఒక్కో ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు అయ్యే ఖర్చు ఎంతంటే

ఈ పథకం కింద రాష్ట్రంలో ఏర్పాటు చేయబోచే ఒక్కో ఛార్జింగ్‌ కేంద్రానికి దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 80 శాతం భరిస్తుండగా మిగిలిన 20 శాతం రాష్ట్ర ప్రభుత్వంలోని డిస్కంలు భరిస్తాయి. అయితే ఛార్జింగ్ కేంద్రాల ఇన్‌స్టలేషన్‌ విధానంలో నిర్వహించేందుకు ఆపరేటర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ టెండర్లు దక్కించుకున్న వారు ఐదేళ్ల పాటు వీటిని నడిపించుకోవచ్చు.

రెండో దశలో మరో 100 ఛార్జింగ్ కేంద్రాలు

ఇక రెండో దశలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం లోచిస్తోంది. ముఖ్యంగా వైజాన్, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో అనుకూలమైన స్థలాలను గుర్తించి కేంద్రాలకు ప్రతిపాదనలను పంపింది. వీటిలో మొత్తం దాదాపు 100 వరకు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *