
పని మీద బయటకు వెళ్దామని కారు సిద్ధం చేసి బోనెట్ తెరిచిన ఆ యజమానికి ఒక్కసారిగా ప్రాణాలు పోయినంత పనైంది. ఇంజిన్ భాగంలో హాయిగా చుట్ట చుట్టుకుని కూర్చున్న ఒక భారీ నాగుపాము, బోనెట్ తెరవగానే వెలుగు చూడగానే ఒక్కసారిగా పడగ విప్పి బసలు కొట్టడం మొదలుపెట్టింది. ఆదివారం విశాఖపట్నంలోని కుర్మన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనతో కారు ఓనర్ భయంతో పరుగులు తీశాడు. కుర్మన్నపాలెంలోని ఒక నివాస ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న కారు ఇంజిన్ లోకి నాగుపాము దూరినట్లు స్థానికులు గమనించారు. విషయం తెలియని యజమాని కారు వద్దకు వచ్చి బోనెట్ తీయగా, లోపల ఉన్న నాగుపాము ఒక్కసారిగా పైకి లేచింది. దాన్ని చూసి కారు యజమానితో పాటు చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాము బుస కొడుతుండటంతో ఎవరూ దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కిరణ్, ఎంతో చాకచక్యంగా కారు ఇంజిన్ లో దాక్కున్న ఆ నాగుపామును బయటకు తీసి అడవిలో వదలిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్
అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’