టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్


టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువుల కొనుగోలు ప్రక్రియలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. టెండర్ల విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ టెండర్ పోర్టల్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. దీనిపై అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేడియంట్ ఇన్ఫోనెట్ సంస్థ రూపొందించిన వెబ్‌సైట్ ప్రోటోటైప్, డిజైన్‌ను ఆయన పరిశీలించారు. టెండర్లలో పాల్గొనే సరఫరాదారులు ముందుగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. వారి అర్హతలు, నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను ఏరివేసి, నిజమైన వ్యాపారులకు సమాన అవకాశాలు కల్పిస్తారు. ధ్రువీకరించిన సరఫరాదారులతో ఒక పటిష్టమైన డేటాబేస్ రూపొందిస్తారు. మార్కెట్ ధరలు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల టీటీడీ మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. దీనివల్ల సరఫరాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడం సాధ్యమవుతుంది. ఈ డిజిటల్ విధానం వల్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, టీటీడీపై భక్తులకు మరియు సరఫరాదారులకు మరింత విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *