OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఆ రెండూ చాలా స్పెషల్

OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఆ రెండూ చాలా స్పెషల్


OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఆ రెండూ చాలా స్పెషల్

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వచ్చే వారం ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 లాంటి సినిమాలు థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్ ను వదిలేశారు. ఈ వారమే రిలీజ్ కావాల్సిన బ్యాండ్ మేళం కూడా వాయిదా పడింది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కొన్ని ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. ఈ వారం ఓవరాల్ గా 20కు పైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుండడం విశేషం. ఇందులో ప్రధానంగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విశ్వక్ సేన్ ఫంకీ, ప్రియాంక మోహన్ మేడిన్ కొరియా సినిమాలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ద తాజ్ స్టోరీ, జూటోపియా 2 వంటి ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి మార్చి రెండో వారంలో ఏయే ఓటీటీలో ఏయే సినిమా స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేద్దాం రండి

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

  • వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 10
  • మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 12
  • వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 12
  • ఫంకీ (తెలుగు సినిమా) – మార్చి 12

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 13
  • లోకల్ టైమ్స్ (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 13

 

జియో హాట్‌స్టార్

  • రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – మార్చి 13
  • ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ వెబ్ సిరీస్) – మార్చి 09
  • జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 13
  • ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 15

జీ5

  • పూకీ (తమిళ సినిమా) – మార్చి 13
  • భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు సినిమా) – మార్చి 13
  • అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) – మార్చి 14

సన్ నెక్స్ట్

  • నాంగళ్ (తమిళ సినిమా) – మార్చి 13
  • ఫ్రైడే (తమిళ మూవీ) – మార్చి 13

లయన్స్ గేట్ ప్లే

  • ద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 13

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • సంకల్ప్ (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 11

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *