
India T20 World Cup 2026 hero Ishan Kishan: భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ (New Zealand) పై ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ప్రత్యేకంగా స్పందించాడు.
టోర్నమెంట్ మొత్తం భారత్ అద్భుతంగా ఆడిందని, జట్టులో ప్రతి ఆటగాడు తన పాత్రను సమర్థంగా నిర్వర్తించాడని శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రదర్శనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.
ఇషాన్ కిషన్ – అసలు మ్యాచ్ ఛేంజర్..
శ్రీకాంత్ మాటల్లో, ఫైనల్ మ్యాచ్‌లో అసలు మలుపు తీసుకువచ్చింది ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అని చెప్పుకొచ్చాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇచ్చిన మంచి ఆరంభాన్ని కిషన్ కొనసాగించి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడని ఆయన అన్నారు.
ఇషాన్ కిషన్ ఫైనల్‌లో కేవలం 25 బంతుల్లో 54 పరుగులు చేసి మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ ఆధీనంలోకి తీసుకువచ్చాడు. టోర్నమెంట్ మొత్తం అతను 317 పరుగులు, సుమారు 200 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా రాణించాడు.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
ఈమేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సంజూ, అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఇషాన్ కిషన్ ఆ మొమెంటమ్‌ను కొనసాగించాడు. అతని 54 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది” అని అన్నారు.
సెలెక్షన్ కమిటీపై ప్రశంసలు..
ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకురావడం సెలెక్షన్ కమిటీ గొప్ప నిర్ణయమని శ్రీకాంత్ అన్నారు. భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), మేనేజ్‌మెంట్ సరైన సమయంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేశారని ప్రశంసించారు.
కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర..
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై కూడా శ్రీకాంత్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఆటగాడికి స్పష్టమైన పాత్ర ఇవ్వడం వల్ల జట్టు విజయవంతమైందని ఆయన చెప్పారు. ఉదాహరణకు శివం దుబే (Shivam Dube) తన పని సిక్సర్లు కొట్టడమే అని తెలిసి అదే విధంగా ఆడాడని పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
కెప్టెన్ సూర్యకుమార్ వ్యూహాలు..
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీపై కూడా శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌లలో అతని వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని చెప్పారు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు.
భారత్ ధైర్యమైన బ్యాటింగ్..
ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు భయపడకుండా దూకుడుగా ఆడింది. గత నాలుగు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మూడు సార్లు 250 పైగా స్కోర్లు చేయడం భారత బ్యాటింగ్ శక్తిని చూపించిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..