
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, గ్నేయ /నైరుతి గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని.. సాధ్యమైనంత మేర పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. కోస్తా కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించినది. దీంతోపాటు.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ /నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
రాయలసీమ :-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తరువాత 4 రోజుల్లో 2-3డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో ఎండ తీవ్రత సగటు కంటే ఎక్కువగా ఉంటుందని.. దక్షిణ తెలంగాణలో గాలుల దిశ మారడం వల్ల వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..