ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే

ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే


ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే

ఏడాదికి 5 లక్షల డాలర్లకు పైగా, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4 కోట్లకు పైగా సంపాదిస్తున్నప్పటికీ, ఓ భారతీయ జంట అత్యంత సాధారణ ఆర్థిక నియమాలను పాటిస్తూ పొదుపు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఈ జంట తమ పొదుపు సూత్రాలను సోషల్ మీడియాలో షేర్‌ చేయగా, అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. అధిక ఆదాయం ఉన్నంత మాత్రాన విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదనే వారి క్రమశిక్షణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం, వారు పాటిస్తున్న ఆర్థిక మంత్రాలు ఇవే. మొదటిది బడ్జెట్‌కు కట్టుబడటం: ఆదాయం ఎంత ఉన్నా, నెలవారీ బడ్జెట్‌ను కచ్చితంగా అనుసరించడం. రెండోది అప్పులకు దూరంగా క్రెడిట్ కార్డు అప్పులను వెంటనే తీర్చడం, వడ్డీ భారం పడకుండా చూసుకోవడం. మూడోది అవసరాలకు, విలాసాలకు మధ్య తేడాను గుర్తించి, అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం. నాల్గవది పెట్టుబడులే ముఖ్యం అని భావించి సంపాదనలో ఎక్కువ భాగాన్ని రిటైర్మెంట్, దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించడం. “ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యం” అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన క్రమశిక్షణ, పొదుపు అలవాట్లే ఇందుకు కారణమని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్ లక్షల వ్యూస్‌తో వైరల్ అవ్వగా, నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్‌ వస్తున్నాయి. “డబ్బును పొదుపు చేయడం గొప్ప విషయమే” అని కొందరు ప్రశంసిస్తుంటే, “జీవితాన్ని ఆస్వాదించడం కూడా ముఖ్యమే కదా” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??

వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే

సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్

Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా

చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *