ఆత్మహ్యత చేసుకునే పరిస్థితిలో ఉంటే పిలిచి 50లక్షలు ఇచ్చాడు.. : రాజా రవీంద్ర

ఆత్మహ్యత చేసుకునే పరిస్థితిలో ఉంటే పిలిచి 50లక్షలు ఇచ్చాడు.. : రాజా రవీంద్ర


ఆత్మహ్యత చేసుకునే పరిస్థితిలో ఉంటే పిలిచి 50లక్షలు ఇచ్చాడు.. : రాజా రవీంద్ర

నటుడు రాజా రవీంద్ర.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో , సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. రాజా రవీంద్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకు సన్నిహితుల గురించి.. వారు చేసిన సాయం గురించి చెప్పుకొచ్చారు. రాజా రవీద్ర మాట్లాడుతూ..తన పెద్ద కుమార్తె వివాహం సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ఆర్థిక సహాయం గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రకాష్ రాజ్ స్వయంగా అడిగి, డబ్బు అవసరమా అని తెలుసుకుని, అడగకుండానే సహాయం అందించారని రవీంద్ర తెలిపారు. ఈ సహాయాన్ని ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని, ప్రకాష్ రాజ్ తన జీవితంలో చూసిన అద్భుతమైన వ్యక్తులలో ఒకరని ఆయన అభివర్ణించారు.

ప్రకాష్ రాజ్ దాతృత్వం కేవలం రాజా రవీంద్రకు మాత్రమే పరిమితం కాలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఒక కళాకారుడికి ప్రకాష్ రాజ్ యాభై లక్షల రూపాయలు సహాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి ఆశించలేదని రవీంద్ర వివరించారు. మానవ సంబంధాలకు, విలువలకు డబ్బు కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ కు పది ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఉందని, అక్కడ ఆయన నివసించే విధానం అసాధారణంగా ఉంటుందని తెలిపారు. చెన్నై, బెంగళూరు సమీపంలోని చిక్‌మంగళూరు వంటి ప్రాంతాలలో ఆయన ప్రకృతికి అత్యంత దగ్గరగా జీవిస్తారని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పాఠశాలలు, రహదారులు, నీటి ట్యాంకులు నిర్మించి అభివృద్ధి చేశారని వెల్లడించారు. సినిమా అనేది ఆయన జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమేనని, సమాజం కోసం ఏదో చేయాలనే తీవ్రమైన తపన ఆయనలో ఉందని రవీంద్ర అన్నారు.

రాజా రవీంద్ర తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా పంచుకున్నారు. హీరోగా చేసిన సినిమా విడుదల కాక, ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు టీవీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చిందని తెలిపారు. ఒరవకల్ సుమన్ సహాయంతో “అందం” సీరియల్‌లో అవకాశాన్ని పొందారు. అలాగే పరిచూరి బ్రదర్స్ తన కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి చాలా సహాయపడ్డారని, వారి రచనల్లో తనకు మంచి పాత్రలు లభించాయని చెప్పారు. ప్రకాష్ రాజ్ తో పాటు బెల్లంకొండ సురేష్, నలమలపు బుజ్జి వంటి వారు కూడా తనకు అవసరమైన సమయంలో సహాయం అందించారని, వీరికి తాను ఏ రకంగానూ ఉపయోగపడలేదని, అయినా తమకు సహాయం చేశారని రాజా రవీంద్ర గుర్తుచేసుకున్నారు. బయటి వ్యక్తుల మాటల ఆధారంగా ఒకరిని అంచనా వేయకుండా, మానవత్వం మరియు నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా సందేశం ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *