JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?


JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్‌, మార్చి 9: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17, 2026న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లన్‌ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానున్నాయి. అంటే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. భారతీయ విద్యార్థులకు మే 2, 2026 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఇక విదేశీ విద్యార్థులు ఏప్రిల్ 6 నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఇక అడ్మిట్‌ కార్డులు మే 11 నుంచి మే 17 వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష మే 17వ తేదీన రెండు పేపర్లకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. పేపర్1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. జూన్ 1, 2026 ఉదయం 10 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం జోసా కౌన్సెలింగ్‌ జూన్‌ 2 నుంచి మొదలవుతుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ 2026) రాసేందుకు జూన్‌ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్‌ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్‌ 7న ఏఏటీ ఫలితాలు విడుదలవుతాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభ తేదీ: భారతీయ విద్యార్థులకు ఏప్రిల్ 23 నుంచి, విదేశీ విద్యార్థులు ఏప్రిల్ 6 నుంచిస
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: మే 2, 2026 వరకు
  • అడ్మిట్ కార్డులు విడుదల: మే 11 నుంచి మే 17 వరకు
  • జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ: మే 17, 2026
  • ఫలితాలు విడుదల తేదీ: జూన్ 1 ఉదయం 10 గంటలకు
  • జోసా (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: జూన్ 2 నుంచి
  • ఏఏటీ 2026 రిజిస్ట్రేషన్‌: జూన్‌ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
  • ఏఏటీ 2026 పరీక్ష: జూన్‌ 4
  • ఏఏటీ 2026 ఫలితాల విడుదల తేదీ: జూన్‌ 7

కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరయ్యేందుకు జేఈఈ మెయిన్ 2026 పేపర్ 1 పరీక్షలో తొలి 2,50,000 (2.5 లక్షల మంది) ర్యాంకర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఈ పరీక్షను అభ్యర్థులు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అభ్యర్ధులు తప్పనిసరిగా పేపర్ 1, పేపర్ 2 రెండింటికీ హాజరు కావల్సి ఉంటుంది. ఏదైనా ఒక్క పేపర్‌కు హాజరు కాకపోయినా మెరిట్ లిస్ట్‌లో ర్యాంకు కేటాయించరు. పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *