RRB NTPC Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

RRB NTPC Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే..


RRB NTPC Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

హైదరాబాద్‌, మార్చి 9: దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఆర్‌బీ రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ (2025) సీబీటీ 1 పరీక్షకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసిన తమకు కేటాయించిన పరీక్షా నగరం, తేదీ, షిఫ్ట్ వివరాలను చూసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఆర్‌ఆర్‌బీ పరీక్షా షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 27, 2026 వరకు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,810 స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు రోజుకు మూడు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటలకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12:45 గంటలకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతాయి. అయితే అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒకటిన్నర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమతోపాటు ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును, అడ్మిట్ కార్డును తమతోపాటు తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మహిళా అభ్యర్ధులు మెటల్‌ అభరణాలు పరీక్ష కేంద్రం బయట పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. పరీక్షా కేంద్రం పూర్తి చిరునామాతో కూడిన అడ్మిట్ కార్డ్‌లు సంబంధిత అభ్యర్థి పరీక్ష తేదీకి సరిగ్గా నాలుగు రోజుల ముందు మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. ఈ మేరకు అభ్యర్ధులు తమ పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది. ఇక ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 90 నిమిషాల సమయంలో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *