Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??

Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??


Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??

నటి రుక్మిణీ వసంత్ ఇటీవల ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఫోటోలు తీయడం, ముఖ్యంగా రాంగ్ యాంగిల్స్‌లో చిత్రీకరించడం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, నటించడం తమ వృత్తి అయినప్పటికీ, అది తమ వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవడానికి లైసెన్స్ కాదని గట్టిగా చెప్పారు. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీసి మహిళలను అగౌరవపరచడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి పనులు మహిళల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. కేవలం ఒక నటిగా కాకుండా, ఒక మహిళగా తాను ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోనని రుక్మిణీ వసంత్ స్పష్టం చేశారు. ఫోటోగ్రాఫర్లు వృత్తి నైతికతను పాటించాలని, మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అంశంపై సినీ వర్గాల్లో, ప్రజల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది

కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ

రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం

150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *