Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు


Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాలను భానుడి ప్రతాపం తీవ్రంగా దహిస్తోంది. మార్చి మొదట్లోనే దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, 12 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వేడి గాలుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి రెండో వారం నుండి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, వాటర్ నిపుణులు ఈ ప్రాంతాలను హై రిస్క్ జోన్‌గా గుర్తించారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది

కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ

రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం

150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం

బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *