మీ అరచేతిలో ఈ గుర్తు ఉంటే డబ్బే డబ్బు.. రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోవడం పక్కా..

మీ అరచేతిలో ఈ గుర్తు ఉంటే డబ్బే డబ్బు.. రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోవడం పక్కా..


మీ అరచేతిలో ఈ గుర్తు ఉంటే డబ్బే డబ్బు.. రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోవడం పక్కా..

మన శరీరంలోని పుట్టుమచ్చలు కేవలం చర్మంపై గుర్తులు మాత్రమే కాదు.. అవి మన భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని సూచిస్తాయని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులను, సమాజంలో వారి గౌరవ ప్రతిష్టలను అంచనా వేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే కలిగే ఆ ఆశ్చర్యకరమైన లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

అరచేతి మధ్యలో పుట్టుమచ్చ

అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉండటం అత్యంత శుభప్రదమైన సంకేతం. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఇలాంటి వ్యక్తులు జీవితంలో చాలా త్వరగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. వీరికి అప్రయత్నంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు పిడికిలి మూసినప్పుడు ఆ పుట్టుమచ్చ లోపలికి వెళ్ళి మాయమైతే.. మీరు అత్యంత అదృష్టవంతులని అర్థం. దీనిని అపరిమిత సంపద నిల్వ అని పిలుస్తారు. అంటే వీరు సంపాదించిన ధనం వృథా కాకుండా స్థిరంగా ఉంటుంది.

ఏడు తరాల సంపద – లక్ష్మీ కటాక్షం

కుడి అరచేతిలో స్పష్టమైన, లోతైన పుట్టుమచ్చ ఉన్నవారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. నమ్మకం ప్రకారం, వీరి కుటుంబం ఏడు తరాల పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తుంది.
వీరు కేవలం ధనాన్ని సంపాదించడమే కాకుండా, దానిని రెట్టింపు చేసే అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. లక్ష్మీదేవి కృప వీరిపై ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు.

అధికార యోగం – ఉన్నత పదవులు

అరచేతిపై పుట్టుమచ్చలు కేవలం సంపదనే కాదు, అధికారాన్ని కూడా సూచిస్తాయి. వీరికి దృఢ సంకల్పం ఎక్కువ. అందుకే వీరు పరిపాలనా రంగాలు లేదా ప్రభుత్వ ఉన్నత పదవుల్లో స్థిరపడతారు. వీరు ఎక్కడికి వెళ్లినా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. నలుగురిలో ప్రభావవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు అదృష్టానికి సంకేతాలు అయినప్పటికీ, కఠిన శ్రమ మరియు అంకితభావం తోడైనప్పుడే ఆ అదృష్టం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. మీ అరచేతిలో కూడా ఇలాంటి గుర్తులు ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి.

(Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *