
తెలంగాణలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి నెలాఖరులో కనిపించే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ధర్మపురి, ఖమ్మం వంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 38.9 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించిన వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి, వేడి గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు
Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు
సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..
Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా