
ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి వేడినుంచి ఉపశమనం పొందడం, శరీరాన్ని కూల్‌గా ఉంచడం కోసం చాలామంది ప్రత్యేకమైన రిఫ్రెషింగ్ రెసిపీలను ప్రయత్నిస్తుంటారు. అయితే, చాలా మందికి ఫేవరేట్ మజ్జిగ చారు. దీన్ని ప్రతి ఒక్కరు తమ రుచికి తగిన విధంగా వేర్వేరు రకాలుగా తయారుచేస్తారు. కానీ ఇంతవరకు మీరు పాలకూరను ఉపయోగించి ఈ చారును ప్రయత్నించారా? లేకపోతే, ఈ సీజన్‌లో తప్పక ప్రయత్నించండి. పాలకూర మజ్జిగ చారు సూపర్ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాలకూరను తినడానికి ఇష్టపడని పిల్లల కోసం కూడా ఇది అద్భుతమైన మార్గం. రుచిగా, సులభంగా తయారు చేసి, వారికి కూడా పాలకూర మచ్చిగ చారును తినిపించవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా, మీరే సులువుగా ఇంట్లో చేసుకునే కమ్మని పాలకూర మజ్జిగ చారు రెసిపీని తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- పాలకూర – 2 కట్టలు (సన్నగా తరిగినవి)
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- తాలింపు గింజలు – 1 టీస్పూన్
- ఎండుమిర్చి – 2
- వెల్లుల్లి రెబ్బలు – 3 (సన్నగా తరిగినవి)
- కరివేపాకు – 2 రెమ్మలు
- పసుపు – అర టీస్పూన్
- పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
- ఇంగువ – చిటికెడు
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – 1 టీస్పూన్
- పెరుగు – 1 కప్పు (తాజాగా తీసుకోవాలి)
- ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
- కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
- నీరు – అవసరమైతే అర కప్పు
తయారీ విధానం
- పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి సిద్ధం చేయడం
- పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టండి.
- ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయండి.
- కొత్తిమీర, వెల్లుల్లిని కూడా సన్నగా తరిగి సిద్ధం చేసుకోండి.
- కర్రి, మసాలా ఫ్రై చేయడం
- పాన్‌లో నూనె వేసి వేడి చేయండి.
- వేడి నూనెలో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్ది సెకన్లు ఫ్రై చేయండి. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి సుగంధం వచ్చేవరకు వేగనివ్వండి.
పాలకూరను కలపడం
- పచ్చిమిర్చి, ఇంగువ, పాలకూర, ఉప్పు, పసుపు వేసి మిశ్రమం మెల్లగా మగ్గే వరకు కడుపుగా కలుపుతూ వేయించండి. పాలకూర మరిగిన తర్వాత కారం వేసి మరికాసేపు వేయించండి.
పెరుగు కలపడం
మరో గిన్నెలో పెరుగు, అవసరమైతే అర కప్పు నీరు వేసి బాగా కలపండి. చల్లారిన పాలకూర మిశ్రమంలో ఈ పెరుగు మిశ్రమం జాగ్రత్తగా కలపండి. చివరగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి బాగా మిక్స్ చేయండి.
టేస్టీ కోసం చిట్కాలు
- పెరుగు ఎక్కువ పుల్లగా కాకుండా, తగినంత పుల్లగా ఉండేలా తీసుకోవాలి.
- పాలకూరలోని నీరు పూర్తిగా మగ్గేలా కలుపుతూ వేయించాలి, దాంతో రుచి మెరుగుపడుతుంది.
- పెరుగు లేకపోతే మజ్జిగతో కూడా తయారుచేయవచ్చు (2 కప్పులు మజ్జిగ సరిపోతుంది).
- తాజా, గడ్డ పెరుగు తీసుకుంటే రుచి మరింత బాగుంటుంది.