Petrol Prices: దేశ ప్రజలకు త్వరలో మరో షాక్.. పెట్రోల్ ధరల పెంపు ఖాయమే..! ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు త్వరలో మరో షాక్.. పెట్రోల్ ధరల పెంపు ఖాయమే..! ఎంతంటే..?


Petrol Prices: దేశ ప్రజలకు త్వరలో మరో షాక్.. పెట్రోల్ ధరల పెంపు ఖాయమే..! ఎంతంటే..?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ముడి చమురు ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గల్ప్ దేశాల నుంచి భారత్‌ ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. భారత్ 90 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువగా గల్ప్ దేశాల నుంచే వస్తోంది. అయితే గల్ప్ దేశాలపై యుద్ద ప్రభావం పడటంతో సరుకు రవాణా సక్రమంగా జరగడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. యుద్దం కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ధరలపై కేంద్రం వెనకడుగు వేస్తోంది.

గల్ప్‌లో యుద్దం కారణంతో ముడి చమురు సరఫరా కొరత ఏర్పడింది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది. ఇక భారత్‌లోనే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ప్రారంభంలో రష్యా నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురు కొనుగోలు చేసింది. దిగుమతుల్లో 19 నుంచి 21 శాతం వాటా రష్యా కలిగి ఉంది. రోజుకు దాదాపు 1.04 మిలియన్ బ్యారెళ్లు భారత్‌కు దిగుమతి అవుతుండేది. ఇక గల్ప్ దేశాల నుంచి 50 నుంచి 55 శాతం వరకు దిగుమతి అవుతుంది. ఇరాన్, సౌదీ అరేబియాల నుంచి ఎక్కువగా వస్తోంది. రోజుకు దాదాపు 1 మిలియన్ బ్యారెళ్లను ఆ దేశాలు భారత్‌కు సరఫరా చేస్తున్నాయి.

గల్ప్‌లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో చమురు దిగుమతులు భారత్‌కు 50 శాతం నిలిచిపోయింది. అయితే ఇటీవల అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత రష్యా నుంచి చమురు సరఫరా తగ్గిపోయింది. రష్యా ముడి చమురు తక్కువ ధరకే లభిస్తోంది. బ్రెంట్ కంటే బ్యారల్‌‌కు 10-20 డాలర్ల కంటే తక్కువ ధరకే వస్తోంది. అయితే అమెరికా, గల్ప్, బ్రెజిల్, ఆసియా, యూరప్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి పర్షియనల్ గల్ప్ ద్వారా రవాణా చేయనప్పుడు షిప్పింప్ ఛార్జీలు ఎక్కువుతున్నాయి. బ్యారెల్‌కు దాదాపు 5 నుంచి 8 డాలర్ల ఎక్కువ ఖర్చు పడుతుంది. అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. నెల రోజుల పాటు రష్యా నౌకల నుంచి కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాస్త ఉపశమనం కలిగినా.. గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్యారెల్ 150 డాలర్లకు పెరగొచ్చు. దీని వల్ల ఇండియలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు. భారత్‌లో లీటర్ రూ.110కిపైగా చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *