Chicken Liver: చికెన్ లివర్‌ను ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

Chicken Liver: చికెన్ లివర్‌ను ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి


Chicken Liver: చికెన్ లివర్‌ను ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

ఆదివారం వచ్చిందంటే చాలు.. సాధారణంగా మాంసాహార ప్రియులు చికెన్, మటన్ ను ఎంతో ఇష్టంగా కొని తెచ్చుకుని.. మంచిగా వండుకుని తింటుంటారు. వీటితోపాటు వచ్చే లివర్ ను కూడా చాలామంది తింటారు. అయితే చికెన్ లివర్ కన్నా మటన్ లివర్ ను తినేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. చికెన్ లివర్ ను ఆరోగ్యానికి హానికరం అని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి, చికెన్ లివర్ ను తింటే మనకు అనేక పోషకాలు లభించడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మన దేశంతోపాటు ఇతర ఆసియా దేశవాసులు కూడా చికెన్ లివర్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

చికెన్ లివర్ లో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

చికెన్ లివర్ ప్రయోజనాలు ఇవే..

ఐరన్ సమృద్ధి: చికెన్ లివర్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఒక 100 గ్రాముల చికెన్ లివర్ ను తింటే సుమారు 12 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. దీనివల్ల శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత (ఎనీమియా) నుంచి బయట పడవచ్చు.. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది.

విటమిన్ ఎ: చికెన్ లివర్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. పాలు, కోడిగుడ్లు, మటన్, ఇతర మాంసాహారాల కన్నా విటమిన్ ఎ చికెన్ లివర్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఒక 100 గ్రాముల చికెన్ లివర్ లో 10.5 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఎ లభిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, కంటి చూపును మెరుగుపరుస్తుంది, కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కనుక, చికెన్ లివర్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) ప్రయోజనాలు: చికెన్ లివర్ లో విటమిన్ బి2 కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక 100 గ్రాముల చికెన్ లివర్ తో 1.2 మిల్లీగ్రాముల మేర విటమిన్ బి2 లభిస్తుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మనం తినే పిండి పదార్థాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తనాళాలు గట్టిపడకుండా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇతర ముఖ్యమైన ఖనిజాలు: చికెన్ లివర్ లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఇతర పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి.

  • కాల్షియం, ఫాస్ఫరస్: ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దంతాల ఆరోగ్యానికి కూడా ఇవి అవసరం.
  • పొటాషియం: రక్తపోటును (బీపీ) తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది.
  • జింక్: రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవ్వడానికి జింక్ సహాయపడుతుంది.
  • సెలీనియం: ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, కణాల రక్షణకు తోడ్పడుతుంది.

ఈ విధంగా చికెన్ లివర్ తో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక, చికెన్ లివర్ హానికరం కాదు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తరచూ తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *