ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారంలో దుంపలు తప్పకుండా తీసుకోవాలి. బీట్రూట్, క్యారెట్ వంటివి రోజు వారీ ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. కానీ చాలా మందికి ఈ దుంపలు తినాలని అనిపించదు.
ముఖ్యంగా ఈ దుంపలు నేరుగా తినడానికి చాలా మంది దూరంగా ఉంటారు. కానీ ప్రతిరోజూ ఒకే టేస్ట్‌లో తినాలంటే ఎవరికైనా బోర్‌గానే ఉంటుంది. కాస్త వెరైటీగా తీసుకుంటే రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నేరుగా బీట్రూట్ తినాలని అనిపించకపోతే ఒక పెద్ద బీట్రూట్ తీసుకుని దానిని ముందుగా బాగా తురుము కోవాలి. తరువాత అందులో పెరుగు కలిపి, అందులో వంటగదిలో లభించే సుగంధ ద్రవ్యాలు కలుపుకోవాలి. అంతే బీటూరూట్ రైతా రెడీ. దీన్ని అల్పాహారంగా తినవచ్చు లేదంటే దీన్ని భోజనంలో కూడా చేర్చుకోవచ్చు.
ఇలా ప్రతిరోజూ బీట్రూట్ను ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా బీట్రూట్ ఆరోగ్యానికి, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల అనేక వ్యాధులు నుంచి దూరంగా ఉండొచ్చు.
బీట్రూట్ రైతా అన్ని వయసుల వారూ తినవచ్చు. వేసవిలో ఈ రైతాను తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో బీట్రూట్ ఊరగాయ కూడా తయారు చేసుకోవచ్చు.




