Andhra: ఏంటి అక్కాయ్.. ఇలా చేశావ్.. తుప్పల్లో ఓ మొక్కను పెంచింది.. పోలీసుల ఎంట్రీతో

Andhra: ఏంటి అక్కాయ్.. ఇలా చేశావ్.. తుప్పల్లో ఓ మొక్కను పెంచింది.. పోలీసుల ఎంట్రీతో


Andhra: ఏంటి అక్కాయ్.. ఇలా చేశావ్.. తుప్పల్లో ఓ మొక్కను పెంచింది.. పోలీసుల ఎంట్రీతో

ఏలూరు: ఎవరైనా తప్పదారి పడితే.. తులసి వనంలో గంజాయి మొక్కలా తయారాయాడంటూ.. పెద్దలు పేర్కొంటుంటారు.. తులసి, గంజాయి రెండూ మొక్కలే అయినా తులసిని వైద్య పరంగా, పూజల్లోను విరివిగా వాడతారు. అయితే.. తులసి మొక్కను నిత్యం మహిళలు పూజిస్తుంటారు. ప్రతి ఇంటి పెరట్లో, ఇంటి ముందు తులసి మొక్క కనిపిస్తుంది. మరి గంజాయి పెంచటం, దాన్ని నిల్వచేయటం, రవాణా చేయటం చట్ట రీత్యా నేరం.. ఈ విషయం అందరికీ.. తెలుసు.. ఎందుకంటే.. గంజాయి కనిపిస్తే చాలు.. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. కటకటాల వెనక్కి నెడుతున్నాయి..

కానీ.. ఏకంగా ఒక మహిళ తన ఇంట్లోనే గంజాయి మొక్క పెంచటం నూజివీడులో కలకలం రేపింది. పోలీసులు, ఈగల్ టీమ్ నిర్వహించిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ లో ఒక మహిళ గంజాయి మొక్కను పెంచుతున్నట్లు గుర్తించారు. మహిళ తన ఇంటి వెనుక తుప్పల్లో గంజాయి మొక్కను పెంచుతుంది. దీంతో నూజివీడు డి ఎస్ పి ప్రసాద్ ఆ మొక్కను పీకి మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీడియో చూడండి..

ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా.. జరిపిన పోలీసుల సోదాల్లో భారీగా పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి తనిఖీలు పెద్దయెత్తున తరుచుగా జరిపితే నేరస్తుల్లో మరింత భయం ఉంటుందని, నేరాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *