బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్కురాలు బాబా వంగా (Baba Vanga) చేసిన భవిష్యవాణులు మళ్లీ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆమె చెప్పిన 2026 భవిష్యవాణి గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతోంది. ఇరాన్ దేశంపై ఇటు అమెరికా, మరోవైపు, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా ఆయుధ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. అంతేగాక, వాణిజ్యపరమైన సంక్షోభాలు కూడా తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఈ క్రమంలో బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా? అనేది చర్చకు దారితీస్తోంది. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమవుతుందని హెచ్చరిక..
బాబా వంగా ప్రకారం, మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద యుద్ధం ప్రారంభమై అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది అని చెప్పినట్టు వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఈ భవిష్యవాణి మళ్లీ వైరల్ అవుతోంది.
2. మూడవ ప్రపంచ యుద్ధం ప్రమాదం..
కొన్ని కథనాల ప్రకారం 2026లో ఒక పెద్ద అంతర్జాతీయ యుద్ధం ప్రారంభమై అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు అని బాబా వంగా చెప్పిందని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనేది స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
3. యూరప్‌కు పెద్ద నష్టం..
బాబా వంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న మరో విషయం ఏమిటంటే.. ఈ యుద్ధం వల్ల యూరప్ ప్రాంతంలో భారీ విధ్వంసం జరగవచ్చు అని.
4. ఇతర భవిష్యవాణులు..
2026కి సంబంధించి బాబా వంగా పేరుతో మరికొన్ని అంచనాలు కూడా ప్రచారం అవుతున్నాయి: ప్రపంచంలో భారీ ప్రకృతి విపత్తులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అధికంగా పెరగడం
మనుషులకు విదేశ గ్రహ జీవులతో సంప్రదింపు జరగడం వంటి వాదనలు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బాబా వంగా చెప్పిన చాలా అంచనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు అని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు నిజం కావడం గమనార్హం. అయితే, చాలాసార్లు సోషల్ మీడియాలో ఆమె పేరుతో తప్పుడు భవిష్యవాణులు కూడా ప్రచారం అవుతుంటాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)





