
అందాల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత 2021లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది ఈ వయ్యారి.. రవితేజ సినిమా ఖిలాడీ లో గ్లామరస్ గా కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్ లోనే రవితేజ, మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీకి లక్కీ భాస్కర్ సినిమాలో లక్ కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మీనాక్షికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆఫర్స్ ఫుల్లుగానే ఉన్న ఈ భామ వచ్చిన హిట్స్ మాత్రం తక్కువే.. మొత్తంగా పది సినిమాల్లో నటిస్తే హిట్ అయ్యినవి నాలుగు సినిమాలే వాటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకటి ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా అనగనగ ఓ రాజు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ కుర్రభామ. కాగా 29ఏళ్ల ఈ సుందరిని పెళ్లి గురించి ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మీ తోటి హీరోయిన్స్ కు పెళ్లిళ్లు అయిపోతున్నాయి మరి మీ పెళ్ళెప్పుడు అంటూ అడిగిన ప్రశ్నలకు మీనాక్షి చాలా తెలివైన సమాధానం చెప్పింది. తనకు కాబోయే వాడు ఇండస్ట్రీవాడో.. లేక పెద్ద బిజినెస్ మాన్ అయ్యుండాల్సిన అవసరం లేదు అని.. వ్యవసాయం చేసే వాడు కావాలని చెప్పుకొచ్చింది. నన్ను పెళ్లి చేసికునేవాడు కనీసం 100 ఎకరాల ఆస్తి పరుడై ఉండాలి. వంట బాగా తెలిసినవాడై ఉండాలి. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడంలాంటి పనులు చేయాలి. ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి.. అలాంటి వాడు దొరికితే పెళ్ళికి రెడీ అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. దాంతో ఈ క్వాలిటీస్ ఉన్న కుర్రాళ్ళు మీనాక్షి పెళ్లి రిక్వెస్ట్ లు పెట్టేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి