మహిళా సాధికారతకు కేరాఫ్ రాణి రుద్రమదేవి జన్మస్థలం.. ఆ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లతో సహా అంతా మహిళల పాలనే!

మహిళా సాధికారతకు కేరాఫ్ రాణి రుద్రమదేవి జన్మస్థలం.. ఆ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లతో సహా అంతా మహిళల పాలనే!


మహిళా సాధికారతకు కేరాఫ్ రాణి రుద్రమదేవి జన్మస్థలం.. ఆ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లతో సహా అంతా మహిళల పాలనే!

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇక్కడి నారీమణులు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ డిఫరెంట్ చరిత్ర ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా స్వంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు. చట్ట సభల్లో, పరిపాలనలో, పార్టీ పదవుల్లోనూ అతివలే శాసిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఉండగా.. ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఈ ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్ లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు.

ప్రస్తుతం వరంగల్ ఎంపీ గా Dr కడియం కావ్య కొనసాగుతున్నారు..40 ఏళ్ల తర్వాత వరంగల్ ఎంపీగా ఒక మహిళ Dr కడియం కావ్య గెలుపొంది పార్లమెంట్ లో ఓరుగల్లు గళమెత్తి స్త్రీ శక్తిని చాటుతున్నారు. తాజాగా AICC నియమించిన తెలంగాణ pcc మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా వరంగల్ జిల్లా ఆడబిడ్డ కావడం విశేషం.. వరంగల్ ఉమ్మడి జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి మహిళకు pcc అద్యక్ష పదవి దక్కింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో ఎనిమిది మున్సిపాలిటీలకు మహిళలే చైర్ పర్సన్స్ గా పరిపాలన కొనసాగిస్తున్నారు.. మేడారం చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తిగా మహిళలతో ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటుచేశారు.. చైర్ పర్సన్ తో సహా 14 మహిళలే మేడారం ఉత్సవ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా అతివల చేతుల్లోనే ఉంది.. వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్యశరదాదేవి జిల్లా పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. తాజాగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్ నియామకం అయ్యారు.. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా స్నేహ శబరీష్ తన మార్క్ ప్రత్యేకత ను చాటుతున్నారు. యాదృచ్చికంగా GWMC (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్) కమిషనర్ గా చాహత్ బా పాయ్ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ గా కవిత IPS అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఇలాంటి చారిత్రక జిల్లాలో పరిపాలన పగ్గాలు తమ చేతులమీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక జిల్లాలో అతివల పాలనపై జనంలో రకరకాలుగా చర్చ జరుగుతుంది. వీళ్ళేకాదు.. నలుగురు అదనపు కలెక్టర్లు మహిళా అధికారులే కావడం విశేషం. మరోవైపు జిల్లా న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులదే అగ్రస్థానం కావడం విశేషం.

రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని స్త్రీ శక్తిని చాటుతున్న ఈ జిల్లాపై రాష్ట్ర పాలకులు ఉద్దేశ పూర్వకంగానే ఇలాంటి ప్రయోగం చేశారనే చర్చ జరుగుతుంది. మహిళలే సారధులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిపాలనా పగ్గాలు వారి చెక్కుచేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నారు.. రాణీ రుద్రమదేవి ధీరత్వాన్ని చాటుతున్న స్త్రీ శక్తిని చూసి ఓరుగల్లు మహిళలు అంతా గర్వంగా భావిస్తున్నారు. ఈ వనితలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *