Vijay-Rashmika: మేం కూడా మీ ఫ్యాన్సే..ఇలా చేస్తారనుకోలేదు.. విజయ్‌-రష్మికల పెళ్లిపై అలిగిన చిన్నారి.. వీడియో

Vijay-Rashmika: మేం కూడా మీ ఫ్యాన్సే..ఇలా చేస్తారనుకోలేదు.. విజయ్‌-రష్మికల పెళ్లిపై అలిగిన చిన్నారి.. వీడియో


Vijay-Rashmika: మేం కూడా మీ ఫ్యాన్సే..ఇలా చేస్తారనుకోలేదు.. విజయ్‌-రష్మికల పెళ్లిపై అలిగిన చిన్నారి.. వీడియో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాలు వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
గత నెల ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత కూడా బిజీ బిజీగా గడిపారు కొత్త దంపతులు. విజయ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం, నూతన గృహ ప్రవేశం, దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ , , దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, అలాగే హైదరాబాద్ లో అభిమానులకు బంతి భోజనాలు.. ఇక చివరిగా రిసెప్షన్.. ఈ పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్- రష్మికల పెళ్లి ముచ్చట్లే వినిపించాయి. అయితే, ఈ ‘విరోష్’ పెళ్లి వేడుక ముగిసినా, దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతూనే ఉంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ కొత్త జంటపై అలిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

విజయ్ – రష్మికల పెళ్లి వేడుకలను చూస్తున్న ఒక చిన్నారి అభిమాని, తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్‌తో అడిగిన ప్రశ్నలను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
‘విజయ్ దేవరకొండ-రష్మికలు పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా మీ ఫ్యాన్స్‌మే కదా,. మరి మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తున్నాం కదా! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి’ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది చిన్నారి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి.. మమ్మల్ని కూడా పెళ్లికి పిలవలేదు’ అంటూ చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్, రష్మికల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ, ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. మరి ఈ వీడియోను చూస్తే విజయ్- రష్మికలు ఎలా స్పందిస్తారో చూడాలి.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *