
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు బంగారు వ్యాపారులు సుమారు రూ. 6 కోట్ల మేర వినియోగదారులను, తోటి వ్యాపారులను ముంచి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు షరాఫ్ బజార్‌కు చెందిన ఓ నగల వ్యాపారి, మరో నగల తయారీదారుడు వారం వ్యవధిలో తమ దుకాణాలను, నివాసాలను ఖాళీ చేసి అదృశ్యమయ్యారు. వీరిలో ఒకరు నగలు కుదవ పెట్టుకుని అప్పులు ఇవ్వడంతో పాటు, కొత్త ఆర్డర్లు తీసుకునేవారు. మరొకరు ఇతర వ్యాపారులు ఇచ్చే బిస్కట్లను నగలుగా మార్చే పని చేసేవారు. వీరిద్దరూ కలిసి దాదాపు 3 కోట్ల నగదు, 3 కోట్ల విలువైన బంగారాన్ని తీసుకుని ఉడాయించినట్లు సమాచారం. తమ కష్టార్జితం ఆవిరైపోవడంతో బాధితులు దుకాణాల ముందు ఆందోళన చేపట్టారు. అయితే, చాలామంది బాధితుల వద్ద సరైన రశీదులు, ఆధారాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నమ్మకంతో లావాదేవీలు జరిపిన తాము ఇప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసినా, కుదువ పెట్టినా కచ్చితంగా అధికారిక రశీదులు తీసుకోవాలని, లేని పక్షంలో ఇలాంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..