Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..

Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..


Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..

భక్తికి హద్దులు లేవని, సంకల్పం ముందు శారీరక శ్రమ దిగదుడుపేనని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఓ శివభక్తుడు. శ్రీశైల మల్లన్నపై ఉన్న అచంచల విశ్వాసంతో సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని ‘సాష్టాంగ నమస్కారం’ చేస్తూ ప్రయాణిస్తున్న మల్లేష్ ఉదంతం విస్మయానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని జీవరికి తాలూకా మళ్ళీవారిగా గ్రామం నుంచి ప్రారంభమైన ఈ మహా ప్రయాణం ఇప్పటికే 17 రోజులు పూర్తి చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వరకు చేరుకున్న మల్లేష్, ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తారు రోడ్డుపై బోర్లా పడుతూ, ప్రతి అడుగూ “ఓం నమశ్శివాయ” అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగుతున్నాడు. గతంలో పాదయాత్రగా వచ్చినప్పుడు కాళ్ల నొప్పులు వచ్చాయని, కానీ మల్లన్న ఆదేశం మేరకు ఇప్పుడు సాష్టాంగ యాత్ర చేస్తున్నానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ భక్తుడు ఎంతో విశ్వాసంతో చెబుతున్నాడు. ఈ యాత్రలో అందరినీ కదిలిస్తున్న మరో దృశ్యం ఏంటంటే.. మల్లేష్ వెంట ఉన్న వృద్ధురాలైన అతని తల్లి. కొడుకు రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే, ఆమె రెండు లగేజీ బ్యాగులను నెత్తిన మోస్తూ, ఎర్రటి ఎండలో పాదయాత్ర చేస్తూ కొడుకును ప్రోత్సహిస్తోంది. ఈ వయస్సులోనూ కొడుకు భక్తికి అండగా నిలుస్తున్న ఆ తల్లి మమకారం భక్తుల హృదయాలను తాకుతోంది. శ్రీశైలం చేరుకోవడానికి ఇంకా 10 నుంచి 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే ప్రయాణం అత్యంత కఠినమైనది. నల్లమల అటవీ ప్రాంతాన్ని… కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రాళ్లు, ముళ్లు నిండిన ఆ మార్గంలో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూనే వెళ్లాలని మల్లేష్ కృతనిశ్చయంతో ఉన్నాడు. సుమారు నెల రోజుల పాటు సాగే ఈ సాహసోపేతమైన భక్తి యాత్ర సాఫీగా సాగాలని, మల్లన్న కృప ఆ తల్లికొడుకులపై ఉండాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి

Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *