
నందమూరి బాలకృష్ణ తన సినీ శైలిలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు సీనియర్, కమర్షియల్ దర్శకులతో మాత్రమే పనిచేసిన బాలయ్య, ఇప్పుడు యువ తరంతో కలిసి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలతో వస్తున్న దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు నూతన అనుభూతులను అందిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. తొలుత ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను ప్లాన్ చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే, బాలకృష్ణ తన తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకున్నారు. సరిపోదా శనివారం వంటి విజయవంతమైన సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ తదుపరి సినిమా చేయనున్నారు. వివేక్ ఆత్రేయ ఇప్పటికే బాలయ్యకు కథను వినిపించి, ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మెరుగుపరుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Vijay: వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్ – త్రిష.. ఓపెన్ అవుతున్నారా ??
US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్
LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం
US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్